పవన్‌కి మళ్లీ నో చెప్పిన అనసూయ

పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎవ్వరైనా సరే, ఎగిరి గంతేస్తారు. కానీ అదేంటో... అనసూయ మాత్రం ఇందుకు రివర్స్. అత్తారింటికి దారేది లో ఐటెమ్ సాంగ్ చేయమంటే చేయనుపొమ్మంది. ఆనాడే... అనసూయ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి పవన్ సినిమాలో ఛాన్సు వదులుకొందట. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా తెలిపింది. ఓ టీవీ ఛానల్ రియాలిటీ షోలో అనసూయ ఈ విషయాన్ని వెల్లడించింది. `గోపాల గోపాల` సినిమాలో అనసూయకు ఓ పాత్ర ఇచ్చారట. కానీ.. అనసూయ మాత్రం సున్నితంగా తిరస్కరించిందట. ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తే గుర్తింపు దక్కదు.. అందుకే ఆ ఆఫర్ వదిలేశా అంటోంది.. అనసూయ. గోపాల గోపాలలో అనీషా అంబ్రోస్ టీవీ చానల్ యాంకర్ గా కనిపించింది. ఆ పాత్ర కోసం ముందు అనసూయ పేరు పరిశీలించారట. ఆ పాత్రనే వదులుకొంది... అనసూయ.
No comments