టీవీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద షాక్‌: జెమినీ ఛానెల్ ఆగిపోనుందా....? - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Wednesday, July 29, 2015

టీవీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద షాక్‌: జెమినీ ఛానెల్ ఆగిపోనుందా....?

                                                        

బుల్లితెర మీద స‌న్‌నెట్ వ‌ర్క్ సంస్థ‌లు చేసే హంగామా అంతా ..ఇంతా కాదు. తమిళ‌నాడు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ సంస్థ‌ల ఛానెల్స్ టాప్ పొజిష‌న్స్‌లో కొన‌సాగుతున్నాయి. జెమినీ పేరుతో సినిమా, ఎంటర్ టైన్ మెంట్, న్యూస్, కామెడీ ఛానెల్స్ న‌డుపుతున్న సన్‌ టీవీ నెట్‌వర్క్‌ కష్టాల్లో పడింది. డీఎంకే చీఫ్‌ కరుణానిధి మనవడు, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌కు చెందిన ఈ నెట్ వ‌ర్క్‌కు దేశ‌వ్యాప్తంగా 33 ఛానెళ్లున్నాయి.

సన్‌ గ్రూప్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి గతంలో గడువుతో కూడిన అనుమతి ఇచ్చింది. తాజాగా ఆ అనుమతి గడువు ముగుస్తున్న నేపథ్యంలోం తమ నెట్‌వర్క్‌ చానెళ్ల అనుమతి పరిధిని పెంచాలంటూ సన్ గ్రూప్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర హోంశాఖ ఈ వినతిని తిరస్కరించింది. 

త‌మ‌కు ఈ విష‌యానికి సంబంధం లేద‌ని స‌మాచార‌శాఖ‌లో దీనిపై తేల్చుకోవాల‌ని స‌న్‌నెట్‌వ‌ర్క్‌కు సూచించింది. దీంతో స‌న్ నెట్‌వ‌ర్క్ ఛానెళ్ల ప‌రిస్థ‌తి డోల‌యామానంలో ప‌డింది. సన్‌నెట్‌ వర్క్ చానెళ్లు మూతపడతాయన్న వార్తలు గుప్పుమనడంతో ఆయా ఛానళ్లలో పనిచేస్తున్న 6 వేలమంది ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

తెలుగులో సన్‌నెట్ వర్క్‌కు చెందిన జెమినీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, జెమినీ కామెడీ, జెమినీ న్యూస్, జెమినీ లైవ్, జెమినీ యాక్షన్, ఖుషీ టీవీలు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని ఛానెల్స్‌లో జెమినీకి ఎక్కువ ఆదరణ ఉంది. తెలుగులో ఏ భారీ సినిమా రిలీజ్ అయినా కోట్లాది రూపాయలు వెచ్చింది ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ దక్కంచుకుంటోంది. ఇప్పుడు జెమినీ ఛానెల్ మూతపడితే ఆ సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వస్తుంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందా అని సన్‌నెట్ వర్క్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆ సంస్థ ఛానెళ్లు వీక్షించే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad