పవన్ కళ్యాణ్ ఈనెల 9 న మీడియా ముందుకు రానున్నాడు. అప్పుడే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నాడు. తనకి రాజకీయాలపై వున్న అవగాహన, అనుభవాలని ప్రస్తావిస్తూ రాసిన ఓ పుస్తకాన్ని అదే రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
పవర్ కోసం కాదు.. ప్రశ్నించడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు పవన్ పేర్కొన్నాడు. 9 లోక్ సభ, 40 అసెంబ్లీ స్థానాలకి పవన్ కళ్యాణ్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. రెండు రాష్ర్టాల్లోని స్థానాలకి పవన్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచిగానీ లేక కాకినాడ నుంచిగానీ పవన్ పోటీ చేయవచ్చని సమాచారం.
No comments:
Post a Comment