భలే భలే మగాడివోయ్- రివ్యూ - B-Tech Zone

A COmplete Job Portal

Post Top Ad

Friday, September 4, 2015

భలే భలే మగాడివోయ్- రివ్యూ

bhale bhale magadivoy movie review


నాని హీరోగా, మారుతి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, యు.వి. క్రియేషన్స్ కలిసి నిర్మించిన ‘భలే భలే మగాడివోయ్’ ఈ రోజు రిలీజ్ అయ్యింది.  నటన, కనెక్ట్ అయ్యే రూపం, తన కంటూ కొంత ఫాలోయింగ్, ఇండస్ట్రి లో మంచి పరిచయాలు ఉన్నా సరైన హిట్ పడక ఎదురు చూస్తున్న నాని కి భలే భలే తో అయినా  ఆ లోటు తీరిందా?

కథ:


అగ్రికల్చర్ సైంటిస్ట్ గా పనిచేసే లక్కీ(నాని)కి విపరీతమైన మతిమరుపు. సడెన్ గా చేస్తున్న పని మర్చిపోయి, వేరేవేరే పనుల్లో దూరిపోయి ఇబ్బందులు పడుతుంటాడు. అయితే తన మతిమరపుని కవర్ చేసుకునే అమోఘమైన తెలివితేటలు కూడా లక్కీ సొంతం. తనకి పిల్లనిద్దామని వచ్చిన వ్యక్తిని ( మురళీ శర్మ) మర్చిపోయి, ఆఫీసు బాయ్ కి టీ ఎలా తయారుచెయ్యాలో క్లాస్ పీకుతాడు లక్కీ. దానితో చిర్రెత్తుకొచ్చిన ఆ పెద్దమనిషికి లక్కీ అంటే అసహ్యం పుడుతుంది. ఓ రోజు ఆసుపత్రిలో ఉన్న తన బాస్ కి రక్తం ఇవ్వడం కోసం బయల్దేరిన లక్కీ, నందన(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయిని చూసి అసలు పని మర్చిపోతాడు. ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్లి వేరే పేషెంట్ కి రక్తం ఇస్తాడు. అయితే తాను ఎవరికీ రక్తం ఇచ్చింది కూడా తనకి గుర్తుండదు. నందన థాంక్స్ చెప్పినా పట్టించుకోడు అది లక్కీ గొప్పతనం అని నందన నమ్ముతుంది. తాను రక్తం ఇచ్చి రక్షించింది నందన కి కావాల్సిన అమ్మాయికి అని తెలుసుకున్న లక్కీ అప్పటినుండి అపర దానకర్ణుడి లా బిల్డప్ ఇస్తుంటాడు. కొన్నాళ్ళకి ఇద్దరూ లవ్ లో పడిపోతారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే లక్కీ ని చూడటానికి ఆఫీసుకి వెళ్లి, కలవలేక తిరిగొచ్చిన ఆ పెద్దాయనే హీరోయిన్ తండ్రి. సో హీరోయిన్ కి హీరో అంటే లవ్వు, హీరోయిన్ తండ్రికి హీరో అంటే అసహ్యం.  చివరికి లక్కీ నందన ల లవ్ స్టొరీ ఎలా ముగిసింది అనేదే కథ.

ఎలా తీసారు?


హీరోకి మతిమరపు, అందులో ఆ హీరో, ఎలాంటి క్యారెక్టర్ అని అయినా ఇరగదీసే సత్తా ఉన్న నాని.. దానికి తోడు మంచి కామెడి టైమింగ్ తెలిసిన దర్శకుడు మారుతి.. ఈ కాంబినేషన్ చివరిదాకా నవ్వులు పూయిస్తూనే ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొత్త సీన్స్ తో ప్రేక్షకులని బాగా నవ్వించిన మారుతి సెకండ్ హాఫ్ లో అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు.  పరమ రొటీన్ ప్లాట్ తో, అదే ముఖాలతో సెకండ్ హాఫ్ ని చేజేతులా పాడుచేసుకున్నారు.  సినిమా ఫస్ట్ నుండి చివరిదాకా నవ్వుకోవడానికి బాగుంది. కాని సినిమా నుండి బయటకు వచ్చాక ప్రేక్షకుడి పరిస్థితి కూడా హీరోలాగానే ఉంటుంది. ఒక్క సీన్ కూడా మనకి గుర్తుండిపోయేలా లేదు.  థియేటర్ లో నవ్వుకోవడానికి బాగుంది కాని ఇంటికి తీసుకెళ్ళడానికి ఏమీ లేదు. ఈ సినిమా కి పాటలు లేకపోయి ఉంటె కాస్తయినా బడ్జెట్ మిగిలేది. గోపి సుందర్ కంపోజ్ చేసిన పాటలు ఏమాత్రం ఆకట్టుకోకపోగా, సినిమా ఫ్లో కి అడ్డుపడ్డాయి.  లిరిక్స్ లో ప్రయోగాలు బాగానే చేసారు కాని చెత్త  ట్యూన్స్ వల్ల అవి మరుగున పడిపోయాయి. క్లైమాక్స్ కి  అవసరం కాబట్టి ఓ విలన్ (అజయ్), సెకండ్ హాఫ్ లో ఓ బకరా కావాలి కాబట్టి వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమా లో ఉన్నారు. నిజార్ షఫీ కెమెరా పనితనం బాగుంది. సినిమా రిచ్ గా కనిపించింది.

ప్లస్సులు: నాని నటన; బోర్ కొట్టని, క్లీన్ కామెడి.

మైనస్: పాటలు, క్లైమాక్స్, సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడం.

ఫైనల్ వర్డిక్ట్: నాని కోసం ఒకసారి చూడొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

No comments:

Post a Comment

Post Top Ad