Breaking News

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో 'జనగనమన'..!?

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో 'జనగనమన'..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి దర్శకత్వం మీద ఇంట్రస్టు ఎక్కువ. తన సినిమా సంగతులన్నీ దగ్గర నుంచి పర్యవేక్షించేవాడు. అప్పటి వరకు హీరోగా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. జానీ సినిమాను స్వీయదర్శకత్వంలో తెరకెక్కించాడు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. తన కెరీర్ లో బిగ్ ప్లాప్ గా మిగిలిపోయిందీ సినిమా.

చాలాకాలం తర్వాత మళ్లీ పవన్ మెగాఫోన్ పట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో జనగనమన అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ స్వయంగా స్క్రిప్టు చేసుకుంటున్నారని, దేశభక్తి కి చెందిన కథతో, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిత్రం ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

మరోవైపు వెంకటేశ్ తో కలిసి పవన్‌కల్యాణ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ 'ఓ మై గాడ్' సినిమాలో ఆధునిక కృష్ణుడిగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు షూటింగ్ డేస్ తక్కువే కాబట్టి తన దర్శకత్వంలోని సినిమాను తెరకెక్కించడం పెద్ద కష్టం కాదని నిర్ణయానికి వచ్చేశాడట పవన్.

1 comment: