రోడ్డెక్కితే చాలు ఏ మూలన ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనాన్ని ఆపుతారో తెలియదు.. దీంతో చాలాచోట్ల వాహనదారులు బిక్కుబిక్కుమంటూ నడుపుతుంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. హోంగార్డు, కానిస్టేబుల్,ఏఎస్సైలు వాహనాలను ఆపకుండా కొత్త రూల్స్ వచ్చాయి. వీటి ప్రకారం కేవలం ఎస్సై, అంతకన్నా పైస్థాయి అధికారులకు మాత్రమే వాహనాలను ఆపే అధికారముంటుంది. ఒకవేళ హోంగార్డు, కానిస్టేబుల్, ఏఎస్సై ఎవరైనా వాహనాన్ని ఆపితే.. తమకు ఫిర్యాదు చెయ్యొచ్చని తెలిపారు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్. వారిపై శాఖా పరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
Post Top Ad
Tuesday, February 10, 2015
మీ వాహనం ఆపితే ఫిర్యాదు చేయండి....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment