ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు,సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే, ప్రధాని మోడీతో అరవింద్ కేజ్రీవార్ మాట్లాడుతూ త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పగా ఖచ్చితంగా కలుద్ధామని మోడీ చెప్పారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 3స్థానాల్లో, ఒక స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆప్ ఆధిక్యంలో ఉన్న 66 స్థానాల్లో ఆరు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
Post Top Ad
Tuesday, February 10, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment