కంపెనీల ఆర్ధిక లావాదేవీలు, ఆల్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమీషన్ అఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం గూగుల్ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. అలాగే, ఈ తప్పులపై గూగుల్ కంపెనీ యాజమాన్యాన్ని వివరణ కోరింది. సెప్టెంబర్ 10 లోగా వివరణ ఇచ్చుకోవాలని గూగుల్ నిర్వాహకులకు కమీషన్ సూచించగా, గడువును మరింత పెంచాలని గూగుల్ కోరింది.
గూగుల్ సంస్థపై అమెరికా, యూరప్ ఖండాలలో కూడా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువచేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను గూగుల్ దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా భారత్ కు చెందిన భారత్ మెట్రిమొనీ, కన్స్యూమర్స్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా గూగుల్ చేస్తున్న అవాస్తవ ప్రచారాలతో తమ వెబ్ సైట్లు కాస్త నెమ్మదించాయని, దీనివల్ల ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని ఆరోపిస్తున్నాయి.
మొత్తానికి గూగుల్ యాజమాన్యం చిక్కుల్లో పడిందనే చెప్పాలి. నెలరోజుల క్రితమే భారత్ కు చెందిన సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థకు కొత్త సీఈవో గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పడు ఎదురైన ఈ సమస్యని ఆయన ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.
No comments:
Post a Comment